భారతదేశం, నవంబర్ 22 -- Suresh Rangasthalam OTT Streaming Today: తెలుగు నేల మీద నాటక రంగానికి ఒకప్పుడు వెలుగువెలిగిన చరిత్ర ఉంది. పల్లెల్లో తిరునాళ్లు, జాతరలు జరిగితే రాత్రంతా పౌరాణిక, సాంఘిక నాటకాలతో ఊరంతా సందడిగా ఉండేది. కానీ 1980ల దశకంలో టూరింగ్ టాకీసులు, సినిమా థియేటర్ల రాకతో ఆ వైభవం క్రమంగా మసకబారడం మొదలైంది.

సరిగ్గా ఇదే కాలాన్ని, ఆ మార్పు తెచ్చిన భావోద్వేగ సంఘర్షణను కళ్లకు కడుతూ ఇవాళ (నవంబర్ 22) ఓటీటీలోకి రంగస్థలం అనే ప్రత్యేక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో తెలుగులో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఒకప్పటి హీరో, సీనియర్ నటుడు సురేష్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు.

1980ల నాటి ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మారుమూల పల్లెటూరి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. సుందరం అనే రంగస్థల నటుడి చుట్టూ కథనం తిరుగుతుంది. సుందరానికి నాటకమే ప్రాణం. వేదికపైకి ఎక్కి పద్యం...