భారతదేశం, ఏప్రిల్ 8 -- నెలల తరబడి నిరీక్షణకు తెరపడనుంది. సూపర్ హీరోల ముసుగులో సాగే అకృత్యాలను, వెన్నులో వణుకు పుట్టించే మలుపులను ఓటీటీ తెరపై ఆవిష్కరించిన ది బాయ్స్ సిరీస్ ఇప్పుడు తన ఆఖరి అంకానికి చేరుకుంది. ఐదో సీజన్‌తో ఈ ది బాయ్స్ సాగా ముగియనుంది. ఈసారి పోరు మునుపటి కంటే మరింత తీవ్రంగా, రక్తపాతంతో కూడి ఉండబోతోందని చిత్ర యూనిట్ ఇప్పటికే హింట్ ఇచ్చింది.

ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్‌లలో ది బాయ్స్ ఒకటి. సైన్స్ ఫిక్షన్ కామెడీ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ది బాయ్స్ నుంచి ఫైనల్ సీజన్ ఓటీటీలోకి ఇవాళ (ఏప్రిల్ 8) మరికాసేపట్లో స్ట్రీమింగ్ కానుంది. సూపర్ హీరోలపై సెటైర్లు, వాళ్లను చంపేందుకు తిరిగే మరో ముఠా వంటి అంశాలతో ఈ సిరీస్ బాగా పేరు తెచ్చుకుంది.

ది బాయ్స్ సీజన్ 5 అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సాగనుంది. హోమ్‌ల్యాండర్ తన విం...