భారతదేశం, ఆగస్టు 9 -- Sarikothaga OTT Release Today: నేటి డిజిటల్ యుగంలో క్రైమ్, విలన్ డ్రామాల హోరు ఎక్కువవుతున్న వేళ, కుటుంబ సంబంధాలు, భావోద్వేగాల నేపథ్యంతో కూడిన కథలకు ఆదరణ పెరుగుతోంది. సరిగ్గా ఇలాంటి భావోద్వేగాల సమ్మేళనంతో ఓటీటీలోకి తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా ఇవాళ (ఆగస్ట్ 9) వచ్చేసింది.

ఈ కథ అంతా 'రామరాజు' అనే ఒక కఠినమైన కుటుంబ పెద్ద చుట్టూ తిరుగుతుంది. ఇంట్లో ప్రతీ చిన్న విషయానికి నిబంధనలు విధిస్తూ, కనీసం ఆప్యాయత చూపకుండా కుటుంబ సభ్యులను తన సొంత పనిమనుషుల్లా చూసే నియంతలాంటి స్వభావం అతనిది.

తన మామ రాక్షసుడులాంటోడని, రిటైర్మెంట్ తర్వాత ఇంట్లో మరింత నరకంగా ఉంటుందని కోడలు భర్తతో విడాకులు తీసుకోవాలని అనుకుంటుంది. అదే విషయం తల్లిదండ్రులకు కూడా చెబుతుంది. కానీ, వారు సర్దిచెబుతారు. అయితే, రిటైర్మెంట్ తర్వాత కూడా మామ ప్రవర్తనలో ఏమా...