భారతదేశం, ఆగస్టు 28 -- Anbe Diana OTT Release Today: ఎప్పటికప్పుడు ఓటీటీల్లో డిఫరెంట్ సినిమాలు అలరిస్తూనే ఉంటాయి. అలా ఇవాళ (ఆగస్టు 28) ఓటీటీలోకి రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా వచ్చేసింది. ఇందులో సీనియర్ హీరోయిన్ ఆర్కే రోజా కీలక పాత్ర పోషించింది.

ఒకప్పుడు సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆర్కే రోజా కమ్‌బ్యాక్ ఫిల్మ్‌గా వచ్చిన సినిమానే అన్బే డయానా. జూలై 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఫలితంగా ఐఎమ్‌బీలో 7.5 రేటింగ్ కూడా దక్కించుకుంది. అలాంటి అన్బె డయానా ఓటీటీ వివరలాపై మంచి క్యూరియాసిటీ నెలకొంది.

చెన్నైలోని పెరంబూర్ నేపథ్యంగా తెరకెక్కిన 'అన్బే డయానా' సినిమా కథ, సంప్రదాయాలకు కట్టుబడి ఉండే ఓ యువకుడి జీవితంలో చోటుచేసుకునే ఊహించని మలుపుతో ఏం జరిగింద‌నే పాయింట్‌ చుట్టూ సాగుతుంది. స్వేచ్ఛగా జీవించే ఓ ఆంగ్...