భారతదేశం, జూలై 19 -- Anaganaga O Sukravaram OTT Release Today: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఇంద్రజ, మోహన ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ తెలుగు సైన్స్ ఫిక్షన్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా అనగనగా ఓ శుక్రవారం. సాధారణంగా హాలీవుడ్ చిత్రాలలో ఎక్కువగా కనిపించే 'బాడీ స్వాప్' (ఒకరి శరీరంలోకి మరొకరి ఆత్మ మారడం) అనే సరికొత్త కాన్సెప్ట్‌ను ప్యూర్ ఇండియన్ ఎమోషన్స్‌తో ముడిపెట్టి ఈ సినిమాను రూపొందించారు.

కేవలం వినోదానికే పరిమితం కాకుండా తల్లి, కూతుళ్ల మధ్య ఉండే ప్రేమానురాగాలు, జనరేషన్ గ్యాప్ వల్ల వచ్చే మనస్పర్థలను ఈ అనగనగా ఓ శుక్రవారం చిత్రంలో చాలా చక్కగా ఆవిష్కరించినట్లు మూవీ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇటీవలి కాలంలో తెలుగు ఓటీటీల్లో ఇలాంటి విభిన్నమైన కథాంశాలతో వస్తున్న చిత్రాలకు ఆదరణ పెరుగుతుండటం గమనార్హం.

ఇంటికి పెద్ద దిక్కు అయిన తండ్రిని కోల్పోయి...