భారతదేశం, ఏప్రిల్ 5 -- ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో చిన్న చిత్రాలకు, వైవిధ్యమైన కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోంది. తెలుగులోనూ విభిన్న జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కుతున్నాయి. ప్రతివారం సరికొత్తగా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ లవ్ క్రైమ్ కామెడీ డ్రామా చిత్రం వచ్చేసింది.

ఆ సినిమానే లవ్ పాలసీ. టైటిల్‌కు తగ్గట్లుగానే సినిమా లవ్, పాలసీల చుట్టూ సాగుతుంది. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించే ఓ కంపెనీలో హీరో, హీరోయిన్ ఉంటారు. వారు ఇద్దరు ప్రేమించుకుంటారు. ఇన్సూరెన్స్ చేయించేందుకు హీరో తెగ తంటాలు పడుతుంటాడు. ఈ క్రమంలో ప్రజలను యాక్సిడెంట్ అయితే చనిపోతారంటూ భయబ్రాంతులకు గురి చేస్తుంటాడు.

ఇన్సూరెన్స్ అంటే చస్తారని భయపెట్టడం కాదు మీరు చనిపోయాక కూడా కుటుంబానికి అండగా ఉండేది అని చెప్పడం అని హీర...