భారతదేశం, జూన్ 21 -- Sister Mahi OTT Release Today: తెలుగు చిత్ర పరిశ్రమలో కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈసారి ఓటీటీ ప్రేక్షకుల కోసం ఒక సున్నితమైన, హృదయానికి హత్తుకునే కథతో ముందుకు వచ్చారు.

తెలుగు దిగ్గజ డైరెక్టర్ రాఘవేంద్రరావు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వయంగా నిర్మించిన వినూత్న చిత్రం 'సిస్టర్ మహి (ఒక నర్స్ కథ)'. మానవత్వం, నిష్కల్మషమైన ప్రేమ, ఊహించని త్యాగాల నేపథ్యంలో సాగే ఈ భావోద్వేగ భరిత చిత్రాన్ని తాగుబోతు తండ్రి, సవతి తల్లి పెట్టే టార్చర్ మధ్య సాగే నర్స్ కథగా తెరకెక్కించారు.

ఈ సినిమా కథ మొత్తం 'మహి' అనే ఒక దయా హృదయం ఉన్న నర్స్ చుట్టూ తిరుగుతుంది. ఆసుపత్రికి వచ్చే రోగులకు సేవ చేయడం అనేది కేవలం తను చేసే ఉద్యోగం మాత్రమే కాదని, అది మానవత్వంతో కూడిన ఒక పెద్ద బాధ్యత అని మహి బలంగా నమ్ముతుంద...