భారతదేశం, జూలై 26 -- Jathi Rathanam OTT Release Today: ఇటీవల కాలంలో తెలుగు కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులు ఎక్కువగానే వస్తున్నాయి. అందులోనూ ప్రతి ఆదివారం సరికొత్త కంటెంట్‌తో తెలుగు ఓటీటీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ (జూలై 26) ఓటీటీలోకి తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా ఒకటి రిలీజ్ అయింది.

ఆ సినిమా పేరే 'జాతి రత్నం'. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వరుస విజయాలతో అలరించిన నటి రాశి, ప్రతిభావంతుడైన నటుడు శశాంక్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో హీరోయిన్ రాశి అత్తగా చేస్తే.. జాతకాలు పిచ్చి అల్లుడుగా శశాంక్ యాక్ట్ చేశాడు.

జాతకాలు, మూఢనమ్మకాలు, అదృష్టం వెంటపడే ఒక మనిషి జీవితం ఎలాంటి అనూహ్య మలుపులు తిరిగిందనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ కథ సాగుతుంది. కథానాయకుడు విక్రమ్ తన జీవితాన్ని నక్షత్రాలు, రాశ...