భారతదేశం, ఏప్రిల్ 27 -- Amazon Prime OTT Best Thriller Web Series: కథలో వేగం కంటే, ఆ కథ ప్రేక్షకుడిని ఎంతగా ఇన్వాల్వ్ చేసిందనేదే ఓటీటీ థ్రిల్లర్స్ విజయాన్ని నిర్ణయిస్తుంది. కేవలం షాకింగ్ ట్విస్టులు మాత్రమే కాకుండా, పాత్రల మధ్య సాగే మానసిక సంఘర్షణ, రహస్యాలు, వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు ఉంటే ఆ సిరీస్‌ను వదలడం ఎవరికైనా కష్టమే.

మీరు క్రైమ్, సైకలాజికల్, హారర్ తదితర ఎలిమెంట్స్‌తో నిండి ఉన్న థ్రిల్లర్స్ కోసం వెతుకుతుంటే అమెజాన్ ప్రైమ్‌లోని ఈ బెస్ట్ 7 ఓటీటీ థ్రిల్లర్ సిరీస్‌లు కచ్చితంగా చూడాల్సిందే. షాకింగ్ ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే ఆ 7 బెస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు అన్నింటిని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో చూడొచ్చు. మరి అవేంటో లుక్కేద్దాం.

ఇది కేవలం ఒక హారర్ థ్రిల్లర్ సిరీస్ మాత్రమే కాదు. మనిషి మెదడులోని భయాలను తట్టిలేపే సైకలాజికల్ డ్రా...