భారతదేశం, అక్టోబర్ 13 -- OTT Telugu Social Thriller Drama Streaming: పెళ్లికి ముందు పరాయి పురుషుడికి ముఖం చూపిస్తే మరణశిక్ష విధించే వింత ఆచారం ఉన్న ఒక గ్రామం. ఊహకందని ఈ కట్టుబాటు నేపథ్యంగా తెరకెక్కిన తెలుగు సోషల్ డ్రామా చిత్రమే 'పరదా'.

బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్, మలయాళ భామ దర్శనా రాజేంద్రన్, సీనియర్ హీరోయిన్ సంగీత ప్రధాన పాత్రల్లో నటించిన పరదా ఓటీటీలో ఆకట్టుకుంటోంది. సంప్రదాయాలు, స్త్రీ స్వేచ్ఛ మధ్య జరిగే ఘర్షణను ప్రతిబింబించే పరదా ఓటీటీ వాచ్‌రి బెస్ట్ ఆప్షన్.

పడతి అనే ఒక మారుమూల గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. ఆ ఊరి నియమాల ప్రకారం మహిళలు ఎల్లప్పుడూ ముసుగు (పరదా)లోనే ఉండాలి. పరాయి మగవాడు వారి ముఖాన్ని చూస్తే గ్రామ దేవత 'జ్వాలాంబిక' శాపంతో ఊళ్లో గర్భిణీలకు పుట్టే పిల్లలు చనిపోతారనే మూఢనమ్మకాన్ని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. అలాగే, అలా పెళ్...