భారతదేశం, నవంబర్ 25 -- OTT Thriller: ''కొన్ని కథలు వాటంతట అవే బయటపడవు. అవి మెల్లగా చిక్కుముడులు విప్పుకుంటాయి. కొన్ని ముగింపులు మొత్తాన్ని మార్చేస్తాయి''.. ఇదీ డాలింబ్ ట్రైలర్ రిలీజ్ పోస్టులో మేకర్స్ పెట్టిన క్యాప్షన్. ఈ క్యాప్షన్ చూస్తుంటేనే ఈ సినిమాలో మిస్టరీ ఏ లెవల్ లో ఉండబోతుందనేది అర్థం చేసుకోవచ్చు.

జీ5 ఓటీటీ ఒరిజినల్ మూవీగా రాబోతున్న డాలింబ్ ట్రైలర్ ఇవాళ (నవంబర్ 25) రిలీజైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతున్నఈ ట్రైలర్ వణికించేలా ఉంది. ఈ సినిమా డిసెంబర్ 4న ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. జీ5 హిందీలో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ఈ కథ అంతా ఓ అపార్ట్‌మెంట్‌లో మిస్సయిన తన కొడుకును వెతికే తండ్రి చుట్టూ తిరుగుతుందని డాలింబ్ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముంబయి శివార్లలోని ఓ మల్టీ బిల్డింగ్ అపార్ట్‌మెంట్ కు తన కొడుకు ...