భారతదేశం, మే 16 -- OTT Thriller: అవార్డుల సీజన్‌లో ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన ప్రతిష్టాత్మక చిత్రం 'మార్టీ సుప్రీమ్' (Marty Supreme) ఎట్టకేలకు ఓటీటీ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది. ఈ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మూవీ ఇవాళ (మే 16) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ దర్శకుడు జోష్ సఫ్దీ తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'మార్టీన్ సుప్రీమ్' ఓటీటీలోకి వచ్చేసింది. శనివారం నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్, హిందీలో ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది. రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ.1594 కోట్లు కలెక్ట్ చేసింది.

మార్టీ సుప్రీమ్ చిత్రం 98వ అకాడమీ అవార్డుల్లో (ఆ...