భారతదేశం, జూన్ 14 -- Telugu Family Drama Illu OTT Streaming Today: ఇటీవల ఎక్కువగా ఓటీటీల్లో లవ్ స్టోరీలు, క్రైమ్, హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ల సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. వీటి హడావుడి మధ్య.. మనసుకు హత్తుకునే సరికొత్త ఫీల్ గుడ్ డ్రామా తెలుగు ఫ్యామిలీ చిత్రం'ఇల్లు' (Illu Movie).

తెలుగు సీనియర్ నటుడు, రైటర్ హర్ష వర్ధన్, బిందు చంద్రమౌళి భార్యాభర్తలుగా ప్రధాన పాత్రలు పోషించిన ఇల్లు ఓటీటీలోకి ఇవాళ (జూన్ 12) వచ్చేసింది. ఒక ఇల్లు అంటే కేవలం నాలుగు గోడల మధ్య ఉండే కాంక్రీట్ కట్టడమా? లేక మన జ్ఞాపకాలు, అనుబంధాలు ముడిపడి ఉండే ఒక భావోద్వేగమా? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని హత్తుకునేలా, సెటైరికల్‌గా మలిచారు.

కృష్ణ ప్రసాద్ (హర్షవర్ధన్) ఒక మధ్యవయస్కుడైన రచయిత. పదేళ్లుగా ఒక అద్దె ఇంట్లోనే నివసిస్తూ, పుస్తకాలు, జ్ఞాపకాలు, విభిన్న రకాల మొక్కల పెంపకంతో తనదైన ప్...