భారతదేశం, మే 24 -- Telugu Family Comedy Movie OTT Release Today: డిజిటల్ వినోద ప్రపంచంలో విభిన్నమైన, అచ్చ తెలుగు నేటివిటీ కంటెంట్‌ ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. 90ల నాటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసేలా రూపొందించిన ఒక అందమైన ఫ్యామిలీ కామెడీ డ్రామా ఎంటర్‌టైనర్ మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.

స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ లేని ఆ రోజుల్లో ఒక కలర్ టీవీ చుట్టూ ఇరుగుపొరుగు మనుషులు ఎలా అల్లుకుపోయేవారో ఈ కథలో ఎంతో చక్కగా చూపించారు. ఆ సినిమానే కాలనీ సర్కస్. ఈ చిత్రంలో దర్శకుడు వెంకటేష్ మహా ప్రధాన పాత్రలో కనిపించడం విశేషం. 'కేరాఫ్ కంచరపాలెం' వంటి క్లాసిక్ చిత్రంతో తెలుగు సినిమా సత్తా చాటిన ఆయన కాలనీ సర్కస్ మూవీలో ప్రభుత్వ లెక్కల మాస్టర్‌గా అలరించారు.

ఆయనతో పాటు ఉద్విత హర్ష, మాస్టర్ ఆరవ్, బిగ్ బాస్ ఫేమ్, నటుడు కిరీటి దామరాజు, రేవతి నాథ్, అక్షయ్ స...