భారతదేశం, అక్టోబర్ 26 -- OTT Telugu Sci Fi Series Pushpaka Vimanam OTT Release: సరికొత్త సైన్స్ ఫిక్షన్ కాన్సెప్టుతో ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నాడు తెలుగు హీరో సాయి రోనక్. 'ప్రెషర్ కుక్కర్', 'ఓదెల రైల్వే స్టేషన్', 'పాప్‌కార్న్', 'లగ్గం' వంటి సినిమాలతో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సాయి రోనక్.

ఇలా వెండితెరపై వరుస ప్రాజెక్ట్‌లతో సత్తా చాటిన ఈ హీరో సాయి రోనక్ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు ఒక ఎక్స్‌క్లూజివ్ సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ యాక్షన్ డ్రామాతో రెడీ అయ్యాడు. సాయి రోనక్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ లేటెస్ట్ ఓటీటీ సిరీస్ పేరు 'పుష్పక విమానం'.

ఈ సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ పుష్పక విమానం వెబ్ సిరీస్‌లో సాయి రోనక్‌తోపాటు మధు దామరాజు, వడ్లమాని శ్రీనివాస్, భరణి, ...