భారతదేశం, జూలై 17 -- OTT Telugu: ఈటీవీ విన్ తమ మోస్ట్ పాపులర్ డిజిటల్ సిరీస్ 'కథా సుధ - సండే స్టోరీస్' నుంచి లేటెస్ట్ షార్ట్ ఫిల్మ్ 'అనగనగా ఓ శుక్రవారం' (Anaganaga O Sukravaram) అఫీషియల్ ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేసింది. నవ్వు తెప్పించే ఫన్, గందరగోళం, బాడీ స్వాపింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ హిలేరియస్ డ్రామా జులై 19 నుంచి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.

తల్లీకూతుళ్ల జీవితాలు తారుమారయ్యే ఫన్నీ స్టోరీతో వస్తున్న మూవీ ఈ అనగనగా ఓ శుక్రవారం. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే శ్రావణ శుక్రవారం రోజు ఒక ఇంట్లో జరిగే ఊహకందని వింత సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. "మనమే మారిపోయాం.. నేను నీలా.. నువ్వు నాలా" అనే ఒక్క పంచ్ డైలాగ్‌తో ట్రైలర్లో అసలు ఫన్ రైడ్ స్టార్ట్ అవుతుంది.

గుడికి వెళ్లి పూజ చేసుకోవాల్సిన వ...