భారతదేశం, నవంబర్ 18 -- Happy Journey Movie OTT Trending: ఓటీటీ వేదికలపై భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాలతో పాటు, మనసుకు హత్తుకునే వినూత్న కథాంశాలతో వచ్చే చిన్న చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. తాజాగా ఇదే కోవలో తెలుగు ఫీల్-గుడ్ డ్రామా 'హ్యాపీ జర్నీ' (Happy Journey) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్‌లో నిలిచి సంచలనం సృష్టిస్తోంది.

"కొన్ని ప్రయాణాలు ప్రణాళికలను మారుస్తాయి.. మరికొన్ని జీవితాలనే మార్చేస్తాయి" అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ చిత్రం, ఎటువంటి అంచనాలు లేకుండా డిజిటల్ తెరపైకి వచ్చి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. మరి ఈ మూవీని ఎందుకు చూడాలో తెలుసుకోండి.

సాధారణంగా ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు వ్యూస్ రావడం సహజమే కానీ, విమర్శకులు, సాధారణ ప్రేక్షకుల నుంచి ఒకేసారి ప్రశంసలు అందుకోవడ...