భారతదేశం, జూన్ 25 -- OTT Telugu: స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన లేటెస్ట్ సోషల్ అవేర్‌నెస్ డ్రామా 'యుఫోరియా' (Euphoria) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. థియేట్రికల్ రన్‌లో ఆడియన్స్‌ను పెద్దగా మెప్పించలేకపోయిన ఈ సినిమా.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ వేదికగా ఊహించని రేంజ్‌లో దూసుకుపోతోంది. సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తూ ప్రైమ్ వీడియో రెంటల్ చార్ట్స్‌లో ఈ తెలుగు సినిమా ఏకంగా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఈ క్రేజీ అచీవ్‌మెంట్‌పై 'యుఫోరియా' మేకర్స్ సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ చిన్న తెలుగు సినిమా గ్లోబల్ లెవెల్‌లో భారీ క్రేజ్ ఉన్న హాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ 'మైఖేల్' (Michael), 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' (Projec...