భారతదేశం, సెప్టెంబర్ 5 -- Veerabhadruni Rahasyam 2 OTT Release: డిజిటల్ వినోద ప్రపంచంలో తెలుగు ఓటీటీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్న మిస్టరీ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ 'వీరభద్రుని రహస్యం' సరికొత్త మైలురాయిని చేరుకుంది. జీ5 (ZEE5) ప్లాట్‌ఫామ్‌పై ప్రసారమవుతున్న ఈ డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ మొదటి భాగం బంపర్ హిట్ సాధించింది.

ప్రేక్షకుల నుంచి లభించిన అపూర్వ ఆదరణతో ఇప్పుడు వీరభద్రుని రహస్యం సీజన్ 1 పార్ట్ 2 ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు నిర్వాహకులు రంగం సిద్ధం చేశారు. తాజాగా వీరభద్రుని రహస్యం సీజన్ 1 పార్ట్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతం డిజిటల్ కంటెంట్‌లో సస్పెన్స్, దైవిక అంశాలతో కూడిన మిస్టరీ కథలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అదే కోవలో లాంగ్ ఫార్మాట్‌లో రూపుదిద్దుకున్న 'వీరభద్రుని రహస్యం' వీక్షకులను...