భారతదేశం, సెప్టెంబర్ 15 -- Mahendragiri Varahi OTT Streaming: మిస్టరీ, థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్‌తో వచ్చే సినిమాలంటే తెలుగు ఓటీటీ ప్రియులకు అమితమైన ఇంట్రెస్ట్. అలాంటి ఆడియెన్స్ కోసమే తెలుగులో విభిన్న ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ ఈ మిస్టరీ థ్రిల్లర్స్‌ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్.

అలా రీసెంట్‌గా తెలుగులో వచ్చిన మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా మహేంద్రగిరి వారాహి. డివోషనల్‌కి మిస్టరీ, సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ యాడ్ చేసి రూపొందించిన సినిమానే ఇది. ఈ సినిమాలో సుమంత్, మీనాక్షి గోస్వామి హీరో హీరోయిన్లుగా నటించారు.

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన మహేంద్రగిరి వారాహి సినిమాలో క్రేజీ హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రల్లో మెరిశారు. వీరితోపాటు కమల్ కామరాజు, మాళవిక నాయర్, బ్రహ్మానందం, మంజు భార్గవి, వంశీ చాగంటి తదితరులు...