భారతదేశం, ఆగస్టు 8 -- Friday OTT Release Movies Telugu: వీకెండ్ వచ్చిందంటే చాలు సినిమా ప్రియుల చూపు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల పైనే ఉంటుంది. థియేటర్ల దాకా వెళ్లే ఓపిక లేనివారు, ఇంట్లోనే హాయిగా ఓటీటీ స్ట్రీమింగ్ కంటెంట్‌ను ఆస్వాదించడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

దానికి తగ్గట్టే ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 నిన్న (ఆగస్ట్ 7) ఒక్కరోజే సరికొత్త సినిమాలను తీసుకొచ్చాయి. మిలిటరీ యాక్షన్ డ్రామా, రూరల్ లవ్ స్టోరీస్, డార్క్ కామెడీ థ్రిల్లర్స్ వరకు ప్రతీ ఒక్కరి అభిరుచికి తగినట్లుగా ఒక్కోటి ఒక్కో రకంగా ఉండే టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు తెలుగులో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.

గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కార్గిల్ యుద్ధ నేపథ్యంతో సాగే అద్భుతమైన మిలిటరీ సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. 'ఆపరేషన్ సఫేద్ సాగర్:...