భారతదేశం, అక్టోబర్ 1 -- Ameer Log OTT Release In 3 Platforms: పాతబస్తీ హంగామా, హైదరాబాదీ బిర్యానీ ఘుమఘుమలు, యూత్‌ఫుల్ ఎమోషన్స్ సమ్మేళనంగా తెరకెక్కిన లేటెస్ట్ టాలీవుడ్ సినిమా 'అమీర్ లోగ్'. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఏకంగా మూడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకేరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతూ సందడి చేస్తోంది.

సాధారణంగా ఏదైనా సినిమా ఒకే ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మాత్రమే అందుబాటులోకి వస్తుంది. అయితే అమీర్ లోగ్ చిత్రాన్ని ఎక్కువ మంది వీక్షకులకు చేరవేయాలనే ఉద్దేశంతో 3 ఓటీటీల్లోకి ఒకేసారి స్ట్రీమింగ్‌కు దించారు మేకర్స్.

ఆగస్ట్ 21న థియేటర్లలో విడుదలైన అమీర్ లోగ్ సినిమా ఐఎమ్‌డీబీ (IMDb)లో 9.6 రేటింగ్ సాధించడం విశేషం. అమీర్ లోగ్ సినిమాకు రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించగా.. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించార...