భారతదేశం, అక్టోబర్ 3 -- Best OTT Release Movies Telugu This Weekend: తెలుగు డిజిటల్ వినోద రంగంలో తనదైన ముద్ర వేసిన 'ఆహా' ఓటీటీ ప్లాట్‌ఫామ్ రోజురోజుకీ సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కేవలం రొటీన్ సినిమాలు మాత్రమే కాకుండా, యూత్‌ను థ్రిల్ చేసే విభిన్న జోనర్ సినిమాలతో తెలుగు డిజిటల్ ప్రియులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

వీకెండ్ వస్తే చాలు ఓటీటీలో ఏ సినిమా చూడాలా అని సబ్‌స్క్రైబర్లు వెతుకుతుంటారు. అలాంటి వారికోసం ఇవాళ, రేపు వీకెండ్ కోసం ఆహా అనిపించే టాప్ 6 ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

రహస్యాలు, రాజకీయ కుట్రల నేపథ్యంతో సాగే సస్పెన్స్ సైకాలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ ఇది. విధుల పట్ల అంకితభావం ఉన్న ఫారెస్ట్ గార్డ్ మిథున్, తన పాత స్నేహితులను దట్టమైన అడవిలోకి ఆహ్వానిస్తాడు. ప్రశాంతంగా సాగాల్సిన ఆ రాత్రి, అక్రమ వే...