భారతదేశం, ఆగస్టు 23 -- Alpha OTT Release Date Official: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, శార్వరి వాఘ్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' (Alpha). యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్పై యూనివర్స్‌లో మహిళా గూఢచారుల నేపథ్యంతో వచ్చిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

భారీ అంచనాల నడుమ జూలై 3న థియేటర్లలో విడుదలైన ఆల్ఫా సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేయగలిగింది. అయితే, ఇప్పుడు తాజాగా ఆల్ఫా ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఆల్ఫా చిత్రంలో అలియా భట్ 'సీత' అనే సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించగా, బాబీ డియోల్ ఆమె పెంపుడు తండ్రి కల్నల్ ఫతే సింగ్ లఖావత్‌గా విలన్ పాత్రలో నటించారు. తనను చిన్నప్పుడే కిడ్నాప్ చేసి ఒక ప్రయోగాత్మక ఏజెంట్‌గా మార...