భారతదేశం, సెప్టెంబర్ 27 -- Sunil Grover Uncanny Ajay Devgn In Great Indian Kapil Show 5: నవ్వులు పూయించే ఓటీటీ షో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' ఐదో సీజన్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ఈ షో మొదటి ఎపిసోడ్‌లోనే సరికొత్త హంగామా సృష్టించింది.

త్వరలోనే థియేటర్లలోకి రానున్న అత్యంత ఇంట్రెస్టింగ్ హిందీ చిత్రం 'దృశ్యం 3' ప్రమోషన్ల కోసం బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ తన చిత్రబృందంతో కలిసి ఈ ఓటీటీ కామెడీ షో వేదికపై సందడి చేశారు. తెలుగులో వెంకటేష్ 'దృశ్యం' ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే హిందీలో వస్తున్న ఈ మూడో భాగానికి కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ ఎపిసోడ్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాత్రం కమెడియన్ సునీల్ గ్రోవర్ పెర్ఫార్మెన్స్. అజయ్ దేవగన్ ...