భారతదేశం, సెప్టెంబర్ 3 -- Shriya Pilgaonkar About OTT Series Guilty Minds Season 2: ఓటీటీ తెరపై కొన్ని పాత్రలు నటీనటుల మనసులో చెరగని ముద్ర వేస్తాయి. బాలీవుడ్ బ్యూటీ, 'మీర్జాపూర్' ఫేమ్ శ్రియా పిల్గొంకర్‌కు 'గిల్టీ మైండ్స్' సిరీస్‌లోని 'కషాఫ్ ఖాజీ' పాత్ర సరిగ్గా అలాంటిదే.

2022లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ రిలీజ్ ఈ లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా శ్రియ నటనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మొదటి సీజన్ అంతటి ఘనవిజయం సాధించినా తర్వాత కూడా గిల్టీ మైండ్స్ సీజన్ 2 రద్దు కావడం తనను ఎంతగానో బాధించిందని శ్రియా ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

కషాఫ్ పాత్ర తన కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైనదని శ్రియా పిల్గొంకర్ గుర్తు చేసుకున్నారు. "నా హృదయానికి బాగా దగ్గరైన ఓటీటీ సిరీస్ 'గిల్టీ మైండ్స్'. కషాఫ్ పాత్...