భారతదేశం, జూలై 2 -- Project Hail Mary OTT Release: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న ఈ ఏడాది బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ హిట్ మూవీ'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' (Project Hail Mary) ఎట్టకేలకు ఓటీటీ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది. 8.2 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించిన ఈ సినిమాకు 94 శాతం ఫ్రెష్ కంటెంట్‌గా గుర్తింపు వచ్చింది.

హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గోస్లింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ విజువల్ వండర్ థియేటర్లలో భారీ వసూళ్లు సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థియేటర్లలో మిస్ అయిన తెలుగు హాలీవుడ్ లవర్స్ కోసం ఈ గ్లోబల్ బ్లాక్‌బస్టర్ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీ రిలీజ్ కానుంది.

భూమిని అంతరించిపోయే ప్రమాదం నుంచి రక్షించే బాధ్యతను ఒక సాధారణ సైన్స్ టీచర్ భుజానికెత్తుకుంటే ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన కథాంశం...