భారతదేశం, జూన్ 29 -- Top 5 OTT Scam Series To Watch: వినోద రంగంలో ఒకటైన ఓటీటీలో స్టాక్ మార్కెట్ కుంభకోణంపై వచ్చిన 'స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. స్టాక్ మార్కెట్ లూప్‌హోల్స్‌ను వాడుకుని ఒక సాధారణ వ్యక్తి భారత ఆర్థిక వ్యవస్థను ఎలా శాసించాడో కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ ఓటీటీ సిరీస్, డిజిటల్ కంటెంట్ రంగంలోనే ఒక మైలురాయిగా నిలిచింది.

పవర్‌ఫుల్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, మైండ్ గేమ్స్, నిజ జీవిత కుంభకోణాల నేపథ్యంలో సాగే కథలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు ఈ తరహా ఓటీటీ సిరీస్‌లు ఎప్పుడూ హాట్ ఫేవరెట్.

ఇలా రియల్‌గా జరిగిన స్కామ్స్‌పై తెరకెక్కించిన టాప్ 5 ఓటీటీ సిరీస్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ సిరీస్‌లన్నీ దాదాపుగా తెలుగులోనే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఈ టాప్ 5 ఓటీటీ స్కామ్ సిరీస్‌లపై ఓ లుక్కేద్ద...