భారతదేశం, మే 7 -- Wuthering Heights OTT Streaming Details: ప్రపంచ ప్రసిద్ధ నవల ఆధారంగా తెరకెక్కిన ప్రేమ కావ్యం 'వుదరింగ్ హైట్స్' (Wuthering Heights) ఓటీటీలోకి వచ్చేసంది. హాలీవుడ్ స్టార్స్ మార్గోట్ రోబీ, జాకబ్ ఎలోర్డి ప్రధాన పాత్రల్లో నటించిన వుదరింగ్ హైట్స్ ఓటీటీలో ఆకట్టుకుంటోంది.

ప్రముఖ దర్శకురాలు ఎమెరాల్డ్ ఫెన్నెల్ దర్శకత్వంలో తెరకెక్కిన వుదరింగ్ హైట్స్ ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. పీరియడ్ రొమాంటిక్ లవ్ రివేంజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా తన థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని, ఇప్పుడు ఓటీటీ వేదికపై అదరగొడుతోంది.

భారీ చిత్రాలను థియేటర్ల తర్వాత ఓటీటీలోకి తీసుకువచ్చే ట్రెండ్‌లో భాగంగానే వదరింగ్ హైట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఇంటర్నేషనల్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ...