భారతదేశం, జూలై 23 -- Kuttram Purindhavan OTT Review In Telugu: సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు లేదా సిరీస్‌లు అనగానే "ఈ హత్య ఎవరు చేశారు?" అనే పాయింట్ చుట్టూనే కథ సాగుతుంది. అయితే నేరం ఎవరు చేశారనే దానికంటే.. ఆ నేరం వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఆ తప్పు వల్ల కలిగే నేరభావన (Guilt) మనిషి జీవితాన్ని, ఆలోచనలను ఎలా నరకంగా మారుస్తుందనే కొత్త కోణాన్ని ఆవిష్కరించింది 'కుట్రం పురిందవన్: ది గిల్టీ వన్' (Kuttram Purindhavan: The Guilty One).

ప్రస్తుతం తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఓటీటీ సిరీస్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దర్శకుడు సెల్వమణి మునియప్పన్ తెరకెక్కించిన ఈ 7 ఎపిసోడ్ల కథనం మొదటి నిమిషం నుంచే వీక్షకులను కథలో మమేకం చేస్తుంది. ఒక హత్య, చిన్నారి కిడ్నాప్ అంశాల చుట్టూ సాగే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఇది. కుట్రం పురింద...