భారతదేశం, ఆగస్టు 27 -- OTT Releases: ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన పెద్ద చిత్రాల ఓటీటీ విడుదలపై సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. మాస్ మహారాజా రవితేజ నటించిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా 'ఇరుముడి'తో పాటు, రాకింగ్ స్టార్ యశ్ నటించిన మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ మూవీ 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' చిత్రాల డిజిటల్ హక్కుల వివరాలు, ఓటీటీ స్ట్రీమింగ్ అప్‌డేట్స్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఎమోషనల్ యాక్షన్ చిత్రం 'ఇరుముడి'. ఈ సినిమా ఆగస్టు 21, 2026న థియేటర్లలోకి అడుగుపెట్టింది. తండ్రీకూతుళ్ల అనుబంధం, అయ్యప్ప దీక్ష నేపథ్యంలో సాగే ఈ విభిన్నమైన కథాంశానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఇరుముడి ఓటీటీ రి...