భారతదేశం, ఏప్రిల్ 20 -- South Producers SIFPA On OTT Release Rule: టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా దక్షిణాది సినీ రంగాన్ని ఓటీటీ విండో (OTT Window) వ్యవహారం కుదిపేస్తోంది. సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం ఎనిమిది వారాల వరకు ఓటీటీ స్ట్రీమింగ్ చేయకూడదనే ప్రతిపాదనలపై నిర్మాతలు భగ్గుమంటున్నారు.

ఆదివారం (ఏప్రిల్ 19) హైదరాబాద్‌లోని హోటల్ దశపల్లాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రతినిధులు అత్యవసరంగా భేటీ అయ్యారు. చిత్ర నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై ఈ సమావేశంలో దక్షిణాది నిర్మాతలు సుదీర్ఘంగా చర్చించారు.

సినిమా నిర్మాణంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి, రిస్క్ తీసుకునేది నిర్మాతలేనని, అలాంటప్పుడు ఇతర స్టేక్ హోల్డర్లు (Stakeholders) తమను సంప్రదించకుండా నిర్ణయా...