భారతదేశం, సెప్టెంబర్ 18 -- OTT Release: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సామాజిక కోర్టురూమ్ డ్రామా 'ది ఇండియా స్టోరీ' (The India Story) ఓటీటీలోకి అడుగుపెట్టింది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల వ్యవధిలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కు వచ్చింది.

ఇవాళ (సెప్టెంబర్ 18) ఓటీటీలోకి ది ఇండియా స్టోరీ సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) లో ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ కోసం అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.

చేతన్ డికే దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మాణంలో రూపొందిన 'ది ఇండియా స్టోరీ' చిత్రం జూలై 24న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి అప్పుడు మిక్స్ డ్ టాక్ వినిపించింది. కానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. ఇప్పుడు రెండు నెలలకు ఓటీట...