భారతదేశం, నవంబర్ 16 -- OTT Releases This Week: వారాంతం వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రియులు థియేటర్లతో పాటు ఓటీటీ వేదికలపై కొత్త కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ వారం ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు భారీ వినోదాన్ని సిద్ధం చేశాయి.

నవంబర్ 16 నుంచి 22 అంటే 7 రోజుల మధ్య నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5 వేదికలపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 సినిమాలు, సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఇందులో తమిళ, హిందీ చిత్రాలతో పాటు ఆకట్టుకునే అంతర్జాతీయ క్రైమ్ థ్రిల్లర్లు, రొమాంటిక్ కామెడీలు ఉన్నాయి.

ఈ వారం అత్యధికంగా నెట్‌ఫ్లిక్స్ వేదికపై పది కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో 'మాంగ్లిక్' (Manglik) అనే థ్రిల్లర్ సిరీస్ నవంబర్ 20న ఓటీటీ రిలీజ్ అవనుంది. భ...