భారతదేశం, ఏప్రిల్ 4 -- థియేటర్లలో విడుదలైన సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఎప్పుడు ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. అలా, నిన్న అంటే ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలైన మూడు సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఆసక్తి నెలకొంది. వాటిలో రెండు సినిమాలు ఒక్క ఓటీటీలోనే రిలీజ్ కానున్నాయి. అలాగే, వాటికి 7కిపైగా ఐఎమ్‌డీబీ రేటింగ్ ఉండటం విశేషం. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన హారర్ ఫాంటసీ కామెడీ మూవీ రాకాస. సంగీత్ శోభన్ సోలో హీరోగా నయన్ సారిక హీరోయిన్‌గా చేసిన సినిమా ఇది. ఓటీటీ సిరీసులకు దర్శకత్వం వహించిన మానస శర్మ రాకాస చిత్రాన్ని తెరకెక్కించారు. గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌తో మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్న రాకాస ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల అయింది.

రాకాస సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తోం...