భారతదేశం, మే 31 -- OTT Release Movies On Amazon Prime: వారాంతం వచ్చిందంటే చాలు ఓటీటీ లవర్స్ సరికొత్త సినిమాల కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వైపు ఆసక్తిగా చూస్తుంటారు. ప్రేక్షకులను అస్సలు బోర్ కొట్టించకుండా అలరించేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ముందుకు వచ్చింది.

మే 29 శుక్రవారం రోజున ఒకేసారి ఆరు డిఫరెంట్ జోనర్ల చిత్రాలను ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. వీటిలో తెలుగులో 3 ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్ నుంచి క్రైమ్ కామెడీ, రొమాంటిక్ డ్రామా వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ ఆరు సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

థియేటర్లలో మంచి బజ్ క్రియేట్ చేసిన 'మేమ్ ఫేమస్' ఫేమ్ సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటించిన స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథే ఈ 'గోదారి గట్టుపైన'. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించార...