భారతదేశం, ఆగస్టు 22 -- OTT Release: తమిళనాడు థియేటర్లలో సంచలనం సృష్టించిన రీసెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అన్బే డయానా' (Anbe Diana) డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ హిట్ చిత్రం త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయనుంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ (SonyLIV) సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగిన సీనియర్ నటి రోజా ఈ అన్బే డయానా మూవీతో చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో హీరోకు తల్లిగా రోజా నటించారు. పద్ధతైన తెలుగు ఫ్యామిలీని నడిపించే ఇల్లాలిగా కనిపించారు. కొడుకు క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించాడని తెలుసుకొని ఆ తల్లి ఏం చేసిందన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

'అన్బే డయానా' చిత్రం ఆగస్టు 28 నుంచి సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌లో ప...