భారతదేశం, నవంబర్ 20 -- Shraddha Das Dhai Chaal OTT Streaming With 50 Episodes: ఓటీటీ వేదికలపై పొలిటికల్ థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'మహారాణి', 'తాండవ్' వంటి ఓటీటీ సిరీస్‌ల బాటలో ఇప్పుడు మరో భారీ రాజకీయ కథనం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ప్రముఖ రచయిత నవీన్ చౌదరి కలం నుంచి జాలువారిన 'జనతా స్టోర్', 'ధాయి చాల్' అనే రెండు బెస్ట్ సెల్లర్ నవలల ఆధారంగా 'ధాయి చాల్' (Dhai Chaal) ఓటీటీ సిరీస్ రూపుదిద్దుకుంది. ఏకంగా 50 ఎపిసోడ్ల సుదీర్ఘ నిడివితో వస్తున్న ఈ సిరీస్ రాజకీయాల్లోని చీకటి కోణాలను, అధికార దాహాన్ని కళ్లకు కట్టనుంది.

తెలుగు ప్రేక్షకులకు 'లీడర్', 'ప్రస్థానం' వంటి విలువలు, కుట్రలతో కూడిన రాజకీయ చిత్రాలంటే ఎంతో ఆసక్తి. సరిగ్గా అదే తరహాలో, ఒక సామాన్య విద్యార్థి నాయకుడు రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయ చద...