భారతదేశం, ఆగస్టు 22 -- Ravi Teja Irumudi And Ameer Log OTT Release Details: ఇలా థియేటర్లలో సినిమాలు విడుదలయ్యాయంటే చాలు అలా వాటి ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అని క్యూరియాసిటీ చూపిస్తుంటారు. ప్రతి వారం సరికొత్త సినిమాలు ఓటీటీల్లో సందడి చేసినప్పటికీ థియేట్రికల్ రిలీజ్ అయిన మూవీస్‌పై మరింత ఇంట్రెస్టింగ్ ఉంటుంది.

అలా నిన్న (ఆగస్ట్ 21) థియేటర్లలో విడుదలైన రెండు సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, వాటి స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. అందులో ఒకటి రవితేజ ఇరుముడి అయితే.. మరొకటి ముగ్గురు హీరోలు నటించిన అమీర్ లోగ్.

ఎంతోకాలంగా సరైన హిట్ లేకుండా పడిగాపులు కాస్తున్న మాస్ మహారాజా రవితేజ నుంచి వచ్చిన డిఫరెంట్ సినిమానే ఇరుముడి. కమర్షియల్ సినిమాలను పక్కనపెట్టి స్టోరీ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ కథతో వచ్చిన రవితేజ మంచి రెస్పాన్స్ అందుకుంటున్న...