భారతదేశం, ఆగస్టు 7 -- Bharat Bhhagya Viddhaata OTT Release: దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ముంబై 26/11 ఉగ్రదాడుల వెనుక ఎన్నో భయానక దృశ్యాలు, మరెన్నో త్యాగాల కథలు దాగున్నాయి. సరిహద్దుల్లో పోరాడే సైనికుల శౌర్యాన్ని సమాజం గుర్తించినట్లే, క్లిష్ట సమయంలో తుపాకుల మోతల మధ్య రోగుల ప్రాణాలు కాపాడిన సామాన్య ఆసుపత్రి సిబ్బంది కథ ఆధారంగా రూపొందిన చిత్రం 'భారత్ భాగ్య విధాత' (Bharat Bhhagya Viddhaata).

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ కీలక పాత్రలో నటించిన భారత్ భాగ్య విధాత సినిమా జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఐఎమ్‌డీబీలో 7 రేటింగ్ సంపాదించుకున్న భారత్ భాగ్య విధాత ఓటీటీలోకి వచ్చేయనుంది.

2008 నవంబర్ 26న ముంబైపై ఉగ్రవాదులు విరుచుకుపడిన సమయంలో ...