భారతదేశం, నవంబర్ 3 -- OTT Malayalam Thriller: సస్పెన్స్ థ్రిల్లర్స్, రియలిస్టిక్ డ్రామాలను తెరకెక్కించడంలో మలయాళ చిత్ర పరిశ్రమ శైలే వేరు. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, బలమైన కథాంశంతో ప్రేక్షకుల మనసులను దోచుకోవడంలో అక్కడి సినిమాలు ఎప్పుడూ ముందుంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన 'ICU' (Intensive Care Unit) మూవీ ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది.

నవంబర్ 6 నుంచి ఈ మూవీ సన్ నెక్స్ట్ (Sun NXT) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. కేవలం ఒక గంట 51 నిమిషాల నిడివితో ఉండే ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు యు/ఎ (U/A) సెన్సార్ సర్టిఫికేట్ లభించింది. బిబిన్ జార్జ్, బాబూరాజ్, మురళీ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా వివరాలు ఇవే.

మలయాళం థ్రిల్లర్ సినిమాలంటే ఓ చిన్న స్టోరీని చివరి వరకూ ఉత్కంఠ రేపే...