భారతదేశం, జూలై 15 -- OTT Malayalam: ప్రస్తుత రోజుల్లో భాషతో అస్సలు సంబంధం లేకుండా కేవలం కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు సినిమాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా మలయాళ చిత్రాలకు మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మధ్య కాలంలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం ఓటీటీ వేదికలపై సరికొత్త మలయాళ చిత్రాలు, సిరీస్‌ సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. హారర్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వంటి విభిన్న జానర్లలో ఈ వారం డిజిటల్ స్క్రీన్‌పై అలరించనున్న ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

నటీనటులు: సురభి సంతోష్, శ్రీకాంత్ శశికుమార్

దర్శకుడు: సునీల్ కరియాట్టుకర

జానర్: రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్

ఎక్కడ చూడవచ్చు: జియోహాట్‌స్టార్ (JioHotstar)

సాంప్రదాయ విలువలను అమితంగా గౌరవించే వేద అనే యువతి జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఊహించని కొన్ని క్లి...