భారతదేశం, జూలై 28 -- 100 Of K Drama OTT Release In Telugu: తెలుగు రాష్ట్రాల్లో కొరియన్ డ్రామాలకు (K-Dramas) ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ఓటీటీల్లో కే-డ్రామాల మోజులో మునిగితేలుతున్నారు.

ఈ క్రేజ్‌ను గమనించిన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' భారతీయ వీక్షకులకు ఊహించని వినోదాల విందు అందించడానికి సిద్ధమైంది. దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ 'సీజే ఈఎన్ఎమ్' (CJ ENM)తో ప్రైమ్ వీడియో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఈ భాగస్వామ్యంలో భాగంగా రాబోయే రెండేళ్లలో 100కు పైగా పాపులర్ కొరియన్ ఓటీటీ షోలను అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్‌పైకి తెస్తున్నారు. ఇందులో 26 సరికొత్త సిరీస్‌లతో పాటు గతంలో సంచలనం సృష్టించిన అనేక హిట్ డ్ర...