భారతదేశం, ఏప్రిల్ 10 -- OTT Horror Thriller Today: ఓటీటీలోకి ఎన్ని సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చిన హారర్ థ్రిల్లర్స్‌కు ఉండే క్రేజ్ వేరు. ఇవాళ అంటే ఏప్రిల్ 10న 19 సినిమాల వరకు ఓటీటీ రిలీజ్ అయితే, అందులో నాలుగు హారర్ థ్రిల్లర్ సినిమాలు ఉండటం విశేషంగా మారింది.

ఆ నాలుగులో కూడా 3 ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా వాటిలో ఒక్కటి మాత్రమే తెలుగులో అందుబాటులో ఉంది. హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉండి విభిన్న జోనర్లలతో నేడు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు, వాటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

మలయాళంలో తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం కనిమంగళం కొవిలకమ్. హారర్ జోనర్‌కు కామెడీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ యాడ్ చేసి తెరకెక్కించిన ఈ సినిమాలో అజ్మల్ ఖాన్ ఏఏ, అభి క్రిష్, ముహమ్మద్ రఫి, కొట్టాయం రమేష్, శరత్ సభా నటించారు. రాజేష్ మోహన్ కథ, దర్శకత్వం ...