భారతదేశం, జూలై 30 -- OTT Horror Thriller: కేవలం 19 రోజుల్లోనే అత్యంత రహస్యంగా షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులను పిచ్చెక్కించిన మలయాళం కల్ట్ హారర్ థ్రిల్లర్ 'చురుళి' (Churuli). ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో (SonyLIV) స్ట్రీమింగ్ అవుతున్న ఈ మైండ్ బెండింగ్ సైకలాజికల్ మిస్టరీ డ్రామా, వీకెండ్‌లో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే మూవీ లవర్స్‌కి ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. 7 ఐఎండీబీ రేటింగ్‌ సాధించిన ఈ సినిమా.. మొదటి ఫ్రేమ్ నుంచి చివరి క్లైమాక్స్ వరకు సీటు అంచున కూర్చోబెడుతుంది.

ఈ హారర్ థ్రిల్లర్ చురుళి సినిమా వెనుక ఉన్న నిర్మాణ విశేషాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. కోవిడ్ లాక్‌డౌన్ ఆంక్షలు రాకంటే ముందే కేరళలోని ఇడుక్కి జిల్లా కులమావు దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ సినిమాను చిత్రీకరించారు. ఎటువంటి కృత్రిమ సెట్...