భారతదేశం, మార్చి 20 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు ప్రతి వారం సరికొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తూనే ఉంటాయి. వాటిలో ఎన్నో జోనర్స్, ఇతర భాషా సినిమాలు ఉన్నప్పటికీ తెలుగు కంటెంట్ మూవీస్, అందులోనూ హారర్ థ్రిల్లర్స్‌కు ఇచ్చే ఇంపార్టెన్స్ వేరు.

పైగా హారర్ థ్రిల్లర్‌కు రివేంజ్, ఫ్యామిలీ, ఎమోషన్ అంశాలతో పాటు గ్లామర్ కూడా యాడ్ చేసి పర్‌ఫెక్ట్‌గా తెరకెక్కిస్తే అవి బాగా క్లిక్ అవుతాయి. దాదాపుగా అలాంటి తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీనే ఇవాళ (మార్చి 20) ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమానే అమరావతికి ఆహ్వానం.

తెలుగులో రివేంజ్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అమరావతికి ఆహ్వానం సినిమాలు ముగ్గురు ముద్దుగుమ్మలు ఎస్తేర్‌ నొరోన్హా, ధ‌న్య బాల‌కృష్ణ‌, సుప్రిత‌ (నటి సురేఖ వాణి కూతురు) ప్రధాన పాత్రలు పోషించారు. వీరితోపాటు శివ కంఠమనేని హీరోగా అలరించారు. అలాగే, అశోక్...