భారతదేశం, అక్టోబర్ 2 -- Kannamoochi OTT Release And Review: డిజిటల్ పరిధి పెరిగిన తర్వాత ఓటీటీ ప్రియులు సైకలాజికల్, హర్రర్ థ్రిల్లర్ కథలను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఈ విభాగంలో ప్రేక్షకులను భయపెడుతూనే, చివరివరకు ఉత్కంఠకు గురిచేసే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి.

సరిగ్గా అలాంటి అనుభూతినే తెలుగు, తమిళ హారర్ థ్రిల్లర్ అన్నమూచి అందిస్తుంది. సూపర్ నేచురల్ అంశాలకు సైకలాజికల్ ట్విస్టులు జోడించి తెరకెక్కించిన ఈ సిరీస్ హారర్ ప్రేమికులను ఓటీటీలో విశేషంగా ఆకట్టుకుంటోంది. అన్నమూచిలో తెలుగు హీరోయిన్ పూర్ణ అలియాస్ షమ్నా కాసిమ్ మెయిన్ లీడ్ రోల్ పోషించింది.

భర్తను కోల్పోయిన ప్రియ (షమ్నా కాసిమ్ / పూర్ణ) అనే మహిళ, తన మూగ, చెవిటి కుమార్తెతో కలిసి చెన్నైలోని ఒక కొత్త అపార్ట్‌మెంట్‌కు మారుతుంది. పాత జ్ఞాపకాలను మర్చిపోయి, కూతురితో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని ప్రా...