భారతదేశం, జూలై 18 -- Chithini OTT Release: హారర్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఓటీటీ లవర్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తుంటారు. ఎప్పుడెప్పుడు కొత్త హారర్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతాయా అని కాచుకుని కూర్చుంటారు. అలాంటి హారర్ థ్రిల్లర్స్ ప్రియుల కోసం ఓటీటీలోకి వచ్చింది ఓ సినిమా.

హారర్ ఫ్యామిలీ డ్రామాగా మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన సినిమానే చితిని (Chithini). ఈ సినిమాకు డైరెక్టర్ ఈస్ట్ కోస్ట్ విజయన్ దర్శకత్వం వహించారు. కేవీ అనిల్ కథ అందించారు. వినయ్ ఫోర్ట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో మోక్ష, ఆరతి నాయర్, ఏనాక్షి గంగూలీ కీలక పాత్రలు పోషించారు.

నూల్‌పుళ అనే గ్రామంలోని పాముక్కాడు అనే ప్రాంతంలో 'చితిని' అనే ఒక పగతో రగిలిపోయే యక్షిణిని బంధిస్తారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు బందీగా ఉన్న ఆ యక్షిణి.. ఆ తర్వాత సంకెళ్లు తెం...