భారతదేశం, ఏప్రిల్ 16 -- Pochamma Special Premiere: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ"ను సబ్‌స్క్రైబర్స్ ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ ఓటీటీ సిరీస్‌లో అంబటి అర్జున్, రమేశ్ ఇందిర, ప్రియ శతమర్షన్, స్నేహల్ కామత్, శృతి నాయుడు, శ్రీ పూజ, కీలక పాత్రల్లో నటించారు.

పోచమ్మ వెబ్ సిరీస్ ఈ నెల 17వ తేదీ నుంచి ఆహాలో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్‌కు రాబోతోంది. అయితే, గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ 24 గంటల ముందుగా యాక్సెస్ పొందవచ్చు. అంటే, ఈ ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ మాత్రం నేటి నుంచే పోచమ్మను ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.

ఇక ఈ వెబ్ సిరీస్‌ను శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్‌పై శ్రుతి నాయుడు నిర్మిస్తోంది. పోచమ్మ వెబ్ సిరీస్‌కు రమేష్ ఇందిర దర్శకత్వం వహించారు. కాగా, ఇవాళ (ఏప్రిల్ 17) పోచమ్మ వెబ్ సిరీస...