భారతదేశం, ఆగస్టు 6 -- Tumbadchi Manjula OTT Streaming In Few Hours: ఇటీవలి కాలంలో ప్రాంతీయ సినిమాలకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా వినూత్న కథాంశాలతో వచ్చే హారర్, కామెడీ డ్రామాలను ఓటీటీ ప్రియులు బాగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన హారర్ కామెడీ మూవీ 'తుంబాడ్చి మంజుల' (Tumbadchi Manjula) ఓటీటీలోకి వచ్చేయనుంది.

థియేటర్లలో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబట్టుకుంది తుంబాడ్చి మంజుల. రూ. 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తే రూ. 19.17 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. అంతేకాకుండా ఐఎమ్‌డీబీలో పదికి 7.4 రేటింగ్ కూడా దక్కించుకుంది. అలాంటి తుంబాడ్చి మంజుల ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో వచ్చేయనుంది.

కొంకణ్‌ ప్రాంతంలోని ఒక ఊరిలో ఈ సినిమా కథ సాగుతుంది. గ్రామంలో పెళ్లి వేడుక జ...